చెంగ్జొ: చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మాళవిక.. 21-17, 19-21, 21-16తో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)ను ఓడించి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
తొలి రౌండ్లోనే ప్రపంచ ఏడో ర్యాంకర్ మరిస్కను చిత్తుచేసిన మాళవిక.. తాజాగా 25వ ర్యాంకర్నూ మట్టికరిపించింది. కాగా బ్యాడ్మింటన్ సూపర్ 1000 టోర్నీలో క్వార్టర్స్ చేరడం మాళవిక కెరీర్లో ఇదే ప్రథమం కావడం విశేషం. క్వార్టర్స్‌లో ఆమె జపాన్ షట్లర్ యమాగుచితో తలపడనుంది.