తిమ్మాపూర్ రూరల్, సెప్టెంబర్ 21: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మ ల్లాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. చదువుతున్నది ప్రభుత్వ పా ఠశాల అయినా ప్రతిభ కొదువలేదని చేతల్లో చూపించారు. హర్యానా వేదికగా అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు నేషనల్ యూత్ అడ్వెంచర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ సాహస కృ త్యాల శిబిరానికి 10 మంది మల్లాపూర్ వి ద్యార్థులు ఎంపికయ్యారు.
ఈ విషయాన్ని పాఠశాల హెచ్ఎం ఉమారాణి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాహస కృత్యాలు నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరింతంగా పెంపొందుతాయని ఆమె అన్నారు. ఈ శిబిరంలో విద్యార్థులు రాఫెలింగ్, మౌంటెనీరింగ్, రివర్క్రాసింగ్ వంటి భిన్నమైన సాహస విన్యాసాల్లో పాల్గొంటారని తెలిపారు. శిబిరానికి ఎంపికైన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స మావేశం నిర్వహించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మధుసూదనాచా రి, స్కౌట్ జిల్లా కార్యదర్శి రాంరెడ్డి పాల్గొన్నారు.