జొహాన్నెస్‌బర్గ్ : వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో ఆరంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌కు సౌతాఫ్రికా తాత్కాలిక కోచ్‌గా మలిబాంగ్వె మకెటను నియమించారు. ఈ మేరకు క్రికెట్ సౌతాఫ్రికా ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత టి20 ప్రపంచకప్ అనంతరం పదవీ విరమణ చేయనున్న మార్క్ బౌచర్ స్థానంలో మకెటను తాత్కాలికంగా నియమించారు. డిసెంబర్-జనవరి నెలల్లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీలలో మూడు టెస్టులు ఆడనున్నది. ఈ సిరీస్ అనంతరం క్రికెట్ సౌతాఫ్రికా శాశ్వత కోచ్‌ను నియమించనున్నట్టు సమాచారం.