కౌలాలాంపూర్: బ్యాడ్మింటన్ తాజా సీజన్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-1000 మలేషియా ఓపెన్‌లో శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 12-21, 21-18, 21-16తో జొనాథన్ క్రిస్టిని చిత్తుచేశాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా జోడీ రెండో రౌండ్‌కు చేరగా.. రుతుపర్ణ-శ్వేతపర్ణ జంట తొలి రౌండ్లోనే ఓడింది. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి పరాజయం పాలవగా.. అర్జున్-ధ్రువ్ ద్వయం తొలిరౌండ్లో ఓడింది.