MS Dhoni | ముంబై: ఐదేండ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అతడికి సంబంధించిన అంశమేదీ వచ్చినా నెట్టింట అతడి అభిమానులు ‘తలా ఫర్ ఏ రీజన్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వస్తుంది.
తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ఈ హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ధోనీ అభిమానులు గతంలో అతడు ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ఫొటోను షేర్ చేస్తున్నారు. అదీగాక అమెరికా ఎన్నికల ఫలితం వెలువడిన తేదీ (6/11/2024..6+1+1+2+2+4=16.. 1+6=7)ని కూడితో వచ్చే సంఖ్య కూడా ధోనీ జెర్సీ నంబర్ అవడంతో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.