Mahela Jayawardene | ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ)కు మూడుసార్లు ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించిన శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దెనె వచ్చే సీజన్ నుంచి మళ్లీ ఆ జట్టు హెడ్‌కోచ్ బాధ్యతల్ని చేపట్టనున్నాడు. ఈ మేరకు ఆదివారం ఎంఐ ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
2017 నుంచి 2022 దాకా కోచ్‌గా పనిచేసిన జయవర్దెనె హయాంలో ముంబై.. 2017, 2019, 2020లో టైటిల్స్ నెగ్గింది. కానీ 2022లో అతడు ఎంఐ గ్లోబల్ క్రికెట్ హెడ్ ఆఫ్ ది క్రికెట్‌గా నియమితుడయ్యాక చీఫ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ రెండేండ్లలో సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ ముంబై హెడ్‌కోచ్‌గా పనిచేసినా ఆ జట్టు ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. దీంతో అంబానీలు 2025 సీజన్‌కు గాను కోచ్ బాధ్యతల్ని మళ్లీ మహేళకే అప్పజెప్పారు.