SA vs AUS : పొట్టి సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా (South Africa) వన్డే సిరీస్‌లో అదిరే బోణీ కొట్టింది. సమిష్టిగా రాణించి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia)పై రికార్డు విజయం సాధించింది. కైర్న్స్ మైదానంలో ఆల్‌రౌండ్ షోతో ఆసీస్‌కు వణుకుపుట్టించింది బవుమా సేన. మొదట ఏడెన్ మర్క్రమ్ (82), కెప్టెన్ తెంబ బవుమా(65)లు అర్ధ శతకాలతో భారీస్కోర్ చేసిన ప్రొటీస్ టీమ్.. అనంతరం ఆసీస్ బ్యాటర్లకు కళ్లెం వేసింది. పేసర్లు ఆదిలోనే బ్రేకివ్వగా.. కేశవ్ మహరాజ్(5-33) ప్రధాన ఆటగాళ్లను వరుసగా పెవిలియన్ చేర్చాడు. దాంతో.. సఫారీ టీమ్ ఏకంగా 98 పరుగుల తేడాతో ఓడించింది.
ఆస్ట్రేలియాను వాళ్ల సొంతగడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా సవాలే. సమిష్టిగా రాణిస్తే తప్ప గెలుపు గడప తొక్కలేం. ఇప్పుడు వైట్ బాల్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. పొట్టి సిరీస్‌లో అద్భుతంగా ఆడిన విజేతగా నిలవని సఫారీ జట్టు వన్డే ట్రోఫీలో బోణీ కొట్టింది. మైదానంలో ఎడెన్ మర్క్రమ్(82), తెంబా బవుమా(65), బ్రీట్జ్(57)లు అర్ధ శతకాలతో చెలరేగి భారీ స్కోర్‌కు బాటలు వేశారు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్(27), మిచెల్ మార్ష్ (88)లు అరవై రన్స్ జోడించి శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరి మెరుపులతో ఆసీస్ ఈజీగా గెలుస్తుందనిపించింది.
Keshav Maharaj! Just absolutely sublime! 🇿🇦🔥
A match-defining, game-changing five-wicket haul; pure brilliance from the Proteas spinner. What a time to pick up your first ODI 5-for! 💪
Phenomenal stuff, Kesh! 💪👏 #WozaNawe pic.twitter.com/tcfdANklST
— Proteas Men (@ProteasMenCSA) August 19, 2025
కానీ, సుబ్రయణ్ తొలి దెబ్బ కొట్టగా.. ఆ తర్వాత కేశవ్ మహరాజ్(5-33) వికెట్ల వేటతో కంగారూలను వణికించాడు. మార్నస్ లబూషేన్(1), కామెరూన్ గ్రీన్(3), డేంజరస్ జోష్ ఇంగ్లిస్(5) .. అలెక్స్ క్యారీ(0)లను డగౌట్ చేర్చి మ్యాచ్‌ను సఫారీల వైపు తిప్పాడు. ఆఖర్లో బెన్ డ్వారుషి (33), నాథన్ ఎల్లిస్(14)లు కాసేపు పోరాడినా ఎంగిడి లోయర్ ఆర్డర్ కథ ముగించాడు. ఆడం జంపాను బౌల్డ్ చేయగా బవుమా బ్యాచ్ 98 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఐదు వికెట్లు తీసి ఆసీస్ నడ్డివిరిచిన మహరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆగస్టు 22 శుక్రవారం రెండో వన్డే జరుగనుంది.
Keshav Maharaj with a beauty to nail Cam Green! #AUSvSA pic.twitter.com/23841JVVEN
— cricket.com.au (@cricketcomau) August 19, 2025