మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 14: జిల్లా కేంద్రంలో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో మహబూబ్‌నగర్ టీమ్ ఓవరాల్ విజేతగా నిలిచింది. టోర్నీ కోసం ఉమ్మడి పది జిల్లాల నుంచి ప్లేయర్లు పోటీపడ్డారు. బాలుర విభాగంలో ఆతిథ్య మహబూబ్‌నగర్ 11-7తో వరంగల్‌పై గెలిచింది. బాలికల తుదిపోరులో మహబూబ్‌నగర్ టీమ్ 9-5తో వరంగల్‌ను ఓడించింది.
బాలుర కేటగిరీలో వరంగల్ రెండు, కరీంనగర్ మూడో స్థానంలో నిలువగా, బాలికల విభాగంలో వరంగల్, ఖమ్మం రెండు, మూ డు స్థానాలు దక్కించుకున్నాయి. ఈ టోర్నీ లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బాలబాలికల జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైనట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదాబాయి పేర్కొన్నారు.