మాడ్రిడ్ : మాడ్రిడ్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ ఎరీనా సబలెంకా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంకా 6-3, 7-6(3)తో అమెరికా యువ టెన్నిస్ ప్లేయర్ కొకో గాఫ్‌పై అద్బుత విజయం సాధించింది. వరుస సెట్లలో గాఫ్‌ను చిత్తుచేసిన సబలెంకా మూడోసారి మాడ్రిడ్ ఓపెన్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఫ్రెంచ్ గ్రాండ్‌స్లామ్‌కు సన్నాహక టోర్నీ అయిన మాడ్రిడ్ ఓపెన్‌లో సబలెంకా సత్తాచాటింది. 2021, 23లో టైటిళ్లు గెలిచిన సబలెంక మూడోసారి టైటిల్ ఒడిసిపట్టి పెట్రా క్విటోవా రికార్డును సమం చేసింది.