మకావు (చైనా): భారత స్టార్ షట్లర్ ద్వయం పుల్లెల గాయత్రి, త్రిసా జాలీ జోడీ మకావు ఓపెన్ సూపర్- 300 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో 23వ ర్యాంకు భారత జోడీ.. 21-12, 21-17తో ఆరో సీడ్ చైనీస్ తైఫీ అమ్మాయిలు హ్సు యిన్-హుయ్, లాన్ జి యున్ను చిత్తు చేసింది.
ఆట ఆరంభం నుంచే ఆధిక్యంలో నిలిచిన భారత జంట.. వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన కిడాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో శ్రీకాంత్ 16-21, 12-21తో కా లంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో నిష్క్రమించాడు.