NZ vs AUS 1st Test : వెల్లింగ్టన్లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) విజృంభించడంతో న్యూజిలాండ్ (Newzealand)పై 172 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన లియాన్ ఈ ఫీట్ సాధించిన పదో స్పిన్నర్‌గా రికార్డుకెక్కాడు. నాలుగో రోజు 196 పరుగులకే కివీస్ కుప్పకూలింది.
నాలుగో రోజు 111/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌ను లియాన్ దెబ్బకొట్టాడు. రచిన్ రవీంద్ర(56), టామ్ బ్లండెల్(0), గ్లెన్ ఫిలిఫ్స్(1)లను ఔట్ చేసి ఆస్ట్రేలియాను గెలుపు వాకిట నిలిపాడు. చివర్లో స్కాట్ కగ్గెలెజీన్(26), మ్యాట్ హెన్రీ(14)లు కాసేపు పోరాడినా గ్రీన్, హేజిల్‌వుడ్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి కివీస్ ఆశలపై నీళ్లు చల్లారు. దాంతో, ఆస్ట్రేలియా భారీ తేడాతే గెలిచి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సెంచరీ హీరో కామెరూన్ గ్రీన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
Nathan Lyon spun Australia to victory, becoming the first spinner to take a Test ten-for in New Zealand since December 2006 😮https://t.co/b33rgwKGuu #NZvAUS pic.twitter.com/Iqcmx41QzH
— ESPNcricinfo (@ESPNcricinfo) March 3, 2024
తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఆలౌటయ్యింది. మూడో రోజు ఫిలిఫ్స్ విజృంభణతో ఆస్ట్రేలియా 164 రన్స్‌కే ఆలౌటయ్యింది. లియాన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌ను తక్కువకే కట్టడి చేసిన న్యూజిలాండ్‌ను ఓపెనర్లు టామ్ లాథమ్(8), విల్ యంగ్(15)లు నిరాశపరిచారు.
Rachin Ravindra cuts one straight to point, and Nathan Lyon also prises out Tom Blundell for a duck!
Australia well in control, New Zealand 126 for 5 chasing 369https://t.co/xgMWgIbxXp #NZvAUS pic.twitter.com/oIIg6kMuQH
— ESPNcricinfo (@ESPNcricinfo) March 2, 2024
తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన విలియమ్సన్(9)ను లియాన్ బోల్తా కొట్టించాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి రచిన్ రవీంద్ర(52 నాటౌట్), డారిల్ మిచెల్(12 నాటౌట్)లు సౌకర్యంగా ఆడారు. దాంతో, నాలుగో రోజు న్యూజిలాండ్ 258 పరుగులు చేసి సిరీస్‌లో బోణీ చేస్తుందని అనిపించింది. కానీ, లియాన్ తన స్పిన్ మాయతో కివీస్ మిడిలార్డర్‌ను డగౌట్‌కు చేర్చాడు.
The Wellington Test could’ve gone New Zealand’s way had it not been for the 174* from Cameron Green, who’s awarded the Player of the Match ✨https://t.co/xgMWgIbxXp #NZvAUS pic.twitter.com/3M0pwaLqSh
— ESPNcricinfo (@ESPNcricinfo) March 3, 2024
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ పేసర్ల ధాటికి ఆసీస్ టాపార్డర్ చేతులెత్తేసింది. అయితే.. కామెరూన్ గ్రీన్(174 నాటౌట్) తొలి సెంచరీతో ఆస్ట్రేలియా 383 పరుగులు బాదింది. అనంతరం నాథన్ లియాన్ నాలుగు వికెట్లు తీసి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దాంతో, ఆతిథ్య జట్టు 129 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆస్ట్రేలియా టెస్టుపై పట్టు బిగించింది.