లక్నో: హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న లక్నో సూప ర్ జెయింట్స్‌కు మరో శుభవార్త. ఆ జట్టు యువ పేసర్ మయాంక్ యాదవ్.. జట్టుతో కలవనున్నాడు. గాయం కారణంగా చాలా కాలంగా ఎన్సీఏకే పరిమితమైన మయాంక్.. పూర్తి స్థాయిలో కోలుకోవడంతో బౌలింగ్ చేయడానికి బీసీసీఐ కూడా అనుమతినిచ్చింది.
మయాంక్.. ఈనెల 19న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశముంది.
రుతురాజ్ స్థానంలో అయుశ్ గాయంతో ఐపీఎల్-18 నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారథి రుతురాజ్ గైక్వాడ్ స్థానాన్ని ముంబై బ్యాటర్ అయుశ్ మాత్రె భర్తీ చేయనున్నాడు.