IPL 2023 : ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది. ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచింది. ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది. నికోలస్ పూరన్(58 : 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయితే… సొంత గడ్డపై 177 లక్ష్య ఛేదనలో రింకూ సింగ్(67 నాటౌట్ : 33బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) వణికించాడు. దాదాపు కోల్‌కతాను గెలిపించనంత పని చేశాడు. కానీ, ఆఖరి ఓవర్లో యశ్ ఠాకూర్ ఐదో బంతికి బౌండరీ ఇవ్వడంతో మ్యాచ్ లక్నో వైపు తిరిగింది.
యశ్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో రింకూ సింగ్(67 నాటౌట్ : 33బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) నాలుగో బంతికి, ఐదో బంతికి సిక్స్ బాదాడు. దాంతో, లక్నో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. పోటీలో ఉండాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్లు ధాటిగా ఆడారు. వెంకటేశ్ అయ్యర్(24), జేసన్ రాయ్(45) దంచి కొట్టారు. అయితే.. విడదీశాడు. ఆ తర్వాత నితీశ్ రానా(8).. ని కృనాల్ పాండ్యా బౌల్డ్ చేశాడు. రహ్మనుల్లా గుర్బాజ్(10), ఆండ్రూ రస్సెల్(7)ను రవి బిష్ణోయ్ బౌల్డ్ చేశాడు. దాంతో, 120 వద్ద కోల్‌కతా ఐదో వికెట్ పడింది. ఆ తర్వాత రింకూ సింగ్ పోరాడాడు.
Make way for the 𝗟𝗨𝗖𝗞𝗡𝗢𝗪 𝗦𝗨𝗣𝗘𝗥 𝗚𝗜𝗔𝗡𝗧𝗦 🙌@LucknowIPL qualify for the #TATAIPL 2023 Playoffs 👏🏻👏🏻#TATAIPL | #KKRvLSG pic.twitter.com/PPqKN1mysz
— IndianPremierLeague (@IPL) May 20, 2023
ప్లే ఆఫ్స్ రేసుకు కీలకమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్(58 : 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో లక్నో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దంచికొట్టిన పూరన్ ఆయుష్ బదోని(25)తో కలిసి ఆరో వికెట్‌కు 50 ప్లస్ రన్స్ జోడించారు. రస్సెల్ వేసిన 20వ ఓవర్లో కృష్ణప్ప గౌతమ్(11 నాటౌట్) సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో, లక్నో పోరాడగలిగే అందించాడు.
కరన్ శర్మ(3) తక్కువకే ఔటయ్యాడు. ఆ తర్వాత వైభవ్ అరోరా ఒకే ఓవర్లో ప్రేరక్ మన్కడ్(26), మార్కస్ స్టోయినిస్(0)ని డకౌట్ చేశాడు. కష్టాల్లో పడిన లక్నోను కెప్టెన్ కృనాల్ పాండ్యా(9), క్వింటన్ డికాక్(28) ఆదుకున్నారు. వీళ్లు ఔటయ్యాక పూరన్, బదోని ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. 73 రన్స్‌కే ఐదు వికెట్లు కోల్పోయిన లక్నో 170 కొట్టిందంటే అందుకే పూరన్ కారణం.