LSG vs KKR : పంతొమ్మిదో సీజన్లో అధ్వాన్నంగా ఆడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఈ రెండు జట్లలో విజయంతో మురిసేది ఎవరు? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. లక్నో సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రిషభ్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు.
మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతాకు ఏదీ కలిసి రావడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. వైఫల్యం ఆ జట్టును ముంచుతోంది. ఒకే ఒక విజయంతో పదో స్థానంలో ఉంది. రెండింట మాత్రమే గెలుపొందిన లక్నో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య గత ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో లక్నో ఆధిక్యంలో ఉంది.
🚨Toss update from Lucknow🚨@lucknowipl won the toss and elected to bowl first against @kkriders
Updates ▶️ https://t.co/elFxwvCeWO#TATAIPL | #KhelBindaas | #LSGvKKR pic.twitter.com/atpHS3DPuk
— IndianPremierLeague (@IPL) April 26, 2026
లక్నో తుది జట్టు : మర్క్రమ్, మార్ష్, పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), పూరన్, బదొని, ముకుల్ చౌదరీ, జార్జ్ లిండే, షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రథీ, మొహ్సిన్ ఖాన్.
ఇంప్యాక్ట్ సబ్స్ – హిమ్మత్ సింగ్, అక్షత్ రఘువంశీ, అబ్దుల్ సమద్, అవేశ్ ఖాన్, మణిమరన్ సిద్దార్థ్.
కోల్‌కతా తుది జట్టు : రహానే(కెప్టెన్), టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), గ్రీన్, రఘువంశీ, పావెల్, రింకూ సింగ్, నరైన్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి.
ఇంప్యాక్ట్ సబ్స్ – మనీశ్ పాడే, ఫిన్ అలెన్, తేజస్వీ సింగ్, నవ్‌దీప్ సైనీ, వరుణ్ చక్రవర్తి.