బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. జోష్ హాజిల్‌వుడ్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి డీకాక్ (3) అవుటయ్యాడు. హాజిల్‌వుడ్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ పంపేందుకు డీకాక్ ప్రయత్నించాడు.
అయితే ఎడ్జ్ తీసుకున్న బంతిని మొదటి స్లిప్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ అందుకున్నాడు. దాంతో డీకాక్ ఇన్నింగ్స్ స్వల్పస్కోరుకే ముగిసింది. బెంగళూరుకు తొలి బ్రేక్ లభించింది. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు ఒక వికెట్ నష్టానికి 17 పరుగులతో నిలిచింది.