బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు కీలక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్ (3), మనీష్ పాండే (6) నిరాశ పరచడంతో.. జట్టును గెలిపించే బాధ్యత అంతా కేఎల్ రాహుల్ (30)పై పడింది. అతను కూడా చూడచక్కని షాట్లతో అలరించాడు. అయితే హర్షల్ పటేల్ వేసిన 8వ ఓవర్ చివరి బంతికి రాహుల్ వెనుతిరిగాడు.
హర్షల్ వేసిన బంతిని లెగ్‌సైడ్ గ్లాన్స్ చేసేందుకు ప్రయత్నించిన రాహుల్ మిస్ అయ్యాడు. అయితే అంపైర్ దాన్ని వైడ్‌గా ప్రకటించలేదు. ఇదే సమయంలో ఆర్సీబీ జట్టు రివ్యూ కోరింది. రీప్లేలో కేఎల్ రాహుల్ బ్యాట్‌ను బంతి చాలా చిన్నగా తాకినట్లు అల్ట్రా ఎడ్జ్‌లో తేలింది. దాంతో రాహుల్ పెవిలియన్ చేరాడు. లక్నో జట్టు మూడో వికెట్ కోల్పోయింది.