LSG vs RCB : ఏక్నా స్టేడియంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్(76 నాటౌట్) విధ్వంసానికి వరుణుడు అడ్డుపడ్డాడు. మార్ష్ దూకుడుతో సెంచరీ దిశగా పరుగెడుతున్న లక్నో స్కోర్ బోర్డుకు మోకాలడ్డుతూ మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. 9వ ఓవర్ పూర్తి అయిందో లేదో వాన మొదలైంది. దాంతో, అంపైర్లు ఆటను నిలిపివేశారు. వాన పుణ్యమాని మార్ష్ ఊచకోత నుంచి బతికిపోయామని ఆర్సీబీ బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు.
సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో మిచెల మార్ష్(76 నాటౌట్) వీరకొట్టుడుకు వర్షం బ్రేకులు వేసింది. భువనేశ్వర్, హేజిల్‌వుడ్‌లను సైతం బాదేస్తూ 20 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన మార్ష్ పవర్ ప్లే తర్వాత జోరు ఆపలేదు. మార్ష్‌ను ఎలా అడ్డుకోవాలి? అని తలలు పట్టుకున్న ఆర్సీబీకి వరుణుడు అండగా నిలిచాడు. 9వ ఓవర్ పూర్తి కాగానే వాన అందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మ్యాచ్ ఆగేసరికి లక్నో అజేయంగా 95 పరుగులు చేసింది. మార్ష్ జతగా ఇన్నింగ్స్ ఆరంభించి వికెట్ కాచుకున్న అర్షిన్ కులకర్ణి 17 రన్స్ కొట్టాడు.
Play stopped in Lucknow due to rain! 🌧️
Stay Tuned for further updates.#TATAIPL | #KhelBindaas | #LSGvRCB
— IndianPremierLeague (@IPL) May 7, 2026