Mitchell Marsh | మార్ష్ వీరకొట్టుడు.. 20 బంతుల్లోనే అర్ధ శతకం..!
Mitchell Marsh : ఐపీఎల్లో పరువు దక్కాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (58 నాటౌట్) దంచేస్తున్నాడు.
Mitchell Marsh : ఐపీఎల్లో పరువు దక్కాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (58 నాటౌట్) దంచేస్తున్నాడు. ఈ సీజన్లో తేలిపోతున్న అతడు ఆర్సీబీ బౌలర్లను ఉతికేస్తూ 20 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. ఐపీఎల్లో మార్ష్‌కు ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ.లక్నో తరఫున అతడు ఏడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. ఈ డాషింగ్ బ్యాటర్ విధ్వంసంతో పవర్ ప్లేలో లక్నో 68 పరుగులు చేసింది.
లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మిచెల్ మార్ష్(58 నాటౌట్) విధ్వంసానికి ఆర్సీబీ బౌలర్లు చేష్టలుడిగిపోతున్నారు. ఈ సీజన్లో వికెట్ల వేటతో రెచ్చిపోతున్న భువనేశ్వర్, హేజిల్‌వుడ్ సైతం మార్ష్ బాదుడుకు బలయ్యారు.
𝗙𝘂𝗹𝗹 𝗦𝗽𝗲𝗲𝗱 𝗺𝗼𝗱𝗲 🔛 🏎🟀
Mitchell Marsh races to a red hot 2️⃣0️⃣-ball FIFTY inside the powerplay 💥#LSG 68/0 after 6 overs.
Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/e8oeyy1OsC
— IndianPremierLeague (@IPL) May 7, 2026
కుర్రాడు రసిక్ దార్ సలాం, బౌన్సర్లు సంధించే స్పిన్నర్ కృనాల్ పాండ్యాను సైతం ఉతికేసిన మార్ష్ .. హేజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్లో బౌండరీతో కేవలం 20 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. అతడి కంటే ముందు నికోలస్ పూరన్(15 బంతుల్లో, 16 బంతుల్లో, 18 బంతుల్లో, 19 బంతుల్లో, 20 బంతుల్లో), ఐదుసార్లు, కైల్ మేయర్స్(20 బంతుల్లో) ఒకసారి లక్నో తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

