Bhuvaneshwar Kumar : భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvaneshwar Kumar) చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి పేసర్‌గా అతడు రికార్డు నెలకొల్పాడు. పంతొమ్మిదో సీజన్లో స్వింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న భువికి.. గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ రెండొందలది. ఈ ఘనత సాధించిన తొలి పేసర్‌గా ఈ వెటరన్ బౌలర్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.
వయసు పైబడుతున్నా కొద్దీ రాటుదేలుతున్న భువనేశ్వర్ ఐపీఎల్లో రెండొందల మ్యాచ్ ఆడుతున్నాడు. తద్వారా మరే పేసర్‌కు సాధ్యమవ్వని రికార్డు పట్టేశాడీ లెజెండ్. భారత జట్టులో చోటు కోల్పోయినా దిగులు చెందకుండా.. ఫ్రాంచైజీ క్రికెట్లో సత్తా చాటుతూ ఆర్సీబీ విజయాల్లో కీలకం అవుతున్నాడు భువి. స్వింగ్ కింగ్‌గా ప్రశంసలు అందుకుంటున్న అతడు 19వ సీజన్లో 17 వికెట్లు తీశాడు. ఇదివరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌కు ఆడిన భువనేశ్వర్ ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Bhuvneshwar Kumar, a two-time Purple Cap winner 🟣, two-time champion 🏆, and one of the most successful pacers, is playing his 200th game 🔥
.
.
.
*This image is AI generated for representation#BhuvneshwarKumar #LSGvsRCB pic.twitter.com/j7GT1Ppgxm— CREX (@Crex_live) May 7, 2026
రెండుసార్లు పర్పుల్ క్యాప్.. రెండు ఐపీఎల్ ట్రోఫీలో గెలుపొందిన భువి.. అత్యధిక మ్యాచ్‌ల రికార్డు సాధించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో భువనేశ్వర్ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన పేసర్లు, పేస్ ఆల్‌రౌండర్ల జాబితాలో కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా.. తదితరులు ఉన్నారు.
1. కీరన్ పొలార్డ్ – 189 మ్యాచ్‌లు
2. డ్వేన్ బ్రావో – 161 మ్యాచ్‌లు
3. హార్దిక్ పాండ్యా – 160 మ్యాచ్‌లు
4. జస్ప్రీత్ బుమ్రా – 155 మ్యాచ్‌లు.