ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు ఇన్నింగ్స్ చాలా నిదానంగా సాగింది. ఆరంభంలోనే బుమ్రా బౌలింగ్‌లో డీకాక్ (10) వికెట్ పడటంతో లక్నో ఇన్నింగ్స్ మందకొడిగా సాగింది. పవర్‌ప్లేను 32/1 స్కోరుతో ముగించిందా జట్టు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (50 నాటౌట్), మనీష్ పాండే (18 నాటౌట్) ఇద్దరూ ఆచితూచి ఆడటంతో లక్నో జట్టు వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది.
అయితే చివర్లో పదో ఓవర్లో పాండే ఒక సిక్సర్, రాహుల్ రెండు ఫోర్లు బాదారు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్లో కూడా ఇద్దరూ రాహుల్ మరో బౌండరీ బాదాడు. ఇలా ఇద్దరూ జోరు పెంచడంతో లక్నో ఇన్నింగ్స్ వేగం పెరిగింది. పదకుండు ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 82/1 స్కోరుతో నిలిచింది.