లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. శుభారంభం అందించేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ (39)ను మాజీ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కృనాల్ పాండ్యా బోల్తా కొట్టించాడు. కృనాల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన గౌతమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అభిమానులంతా ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ (7)ను ఆయుష్ బదోనీ అవుట్ చేశాడు.
బదోనీ వేసిన బంతిని లెగ్‌సైడ్ ఆడేందుకు సూర్య ప్రయత్నించాడు. కానీ లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. దాన్ని రాహుల్ సులభంగా అందుకోవడంతో సూర్యకుమార్ మైదానాన్ని వీడాడు. దీంతో 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది. క్రీజులో తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్ ఉన్నారు. వీళ్లిద్దరూ ఆడితేనే ముంబైకి విజయావకాశాలు ఉంటాయి.