ముంబై జట్టు ఈ ఐపీఎల్లో వరుసగా 8వ ఓటమి మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం ఓటమి చవిచూసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటర్లు ఎవరూ రాణించకపోయినా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (103 నాటౌట్) వీరోచితంగా పోరాడి 168 పరుగుల స్కోరు అందించాడు. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (39), తిలక్ వర్మ (38) మినహా బ్యాటర్లంతా విఫలం అయ్యారు.
ఇషాన్ కిషన్ (8), డెవాల్డ్ బ్రెవిస్ (3), సూర్యకుమార్ యాదవ్ (7), కీరన్ పొలార్డ్ (19), డానియల్ శామ్స్ (3), జయదేవ్ ఉనద్కత్ (1) ఎవరూ రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య 3 వికెట్లతో చెలరేగగా.. మొహ్సిన్ ఖాన్, జేసన్ హోల్డర్, రవి బిష్ణోయి, ఆయుష్ బదోని తలో వికెట్ తీసుకుననారు.