ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్ (10) ఇద్దరూ తడబడ్డారు. ఈ క్రమంలోనే ఆ ఓవర్ ఐదో బంతిని బౌండరీకి తరలించేందుకు డీకాక్ ప్రయత్నించాడు. అతను గాల్లోకి లేపిన బంతిని మిడ్ వికెట్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ జారవిడిచాడు.
దానికితోడు అతని చేతుల్లో నుంచి జారిన బంతి బౌండరీ ఆవల పడటంతో ఆరు పరుగులు వచ్చాయి. ఆ మరుసటి బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన డీకాక్.. షార్ట్ కవర్లో ఉన్న రోహిత్ శర్మకు డైరెక్ట్ క్యాచ్ ఇచ్చాడు. దాన్ని రోహిత్ అద్భుతంగా అందుకోవడంతో డీకాక్ పెవిలియన్ చేరాడు. నాలుగు ఓవర్లలో 27 పరుగులు చేసిన లక్నో తొలి వికెట్ కోల్పోయింది.
Bumrah draws the first blood! Rohit Sharma with a fine catch as Quinton de Kock departs for 10 runs.
Live – https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/yo4tsW75aU
— IndianPremierLeague (@IPL) April 24, 2022