లక్నో సూపర్ జెయింట్స్ తిప్పలు పడుతోంది. ఒక పక్క రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతుంటే.. అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరుతున్నారు. తాజాగా దీపక్ హుడా (10) కూడా పెవలియన్ చేరాడు.
మెరెడిత్ వేసిన బంతిని ఆడే క్రమంలో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న డెవాల్డ్ బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చిన హుడా మైదానం వీడాడు. దీంతో 16 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్, బదోని ఉన్నారు.