లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు బాబా ఇంద్రజిత్ (0), ఫించ్ (14), శ్రేయాస్ అయ్యర్ (6), నితీష్ రాణా (2) తీవ్రంగా నిరాశ పరిచారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ (6).. తను రిస్క్ తీసుకోకుండా ఆండ్రీ రస్సెల్ (39 నాటౌట్)కు ఎక్కువగా స్ట్రైకింగ్ ఇస్తూ వచ్చాడు.
అయితే రవి బిష్ణోయి వేసిన 12వ ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. బిష్ణోయి వేసిన బంతిని స్లాగ్ స్వీప్ చేయడానికి రింకూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాండ్యా సులభంగా క్యాచ్ అందుకోవడంతో ఐదో వికెట్ రూపంలో రింకూ వెనుతిరిగాడు. ప్రస్తుతం ఆ జట్టు విజయావకాశాలన్నీ రస్సెల్ మీదనే ఆధార పడి ఉన్నాయి.