లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి షాక్. ఓపెనర్‌గా వచ్చిన బాబా ఇంద్రజిత్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (6) కూడా నిరాశ పరిచాడు. దుష్మంత చమీర వేసిన షార్ట్ బాల్‌ను సరిగా జడ్జ్ చేయలేకపోయిన అతను.. స్క్వేర్ లెగ్‌లో ఉన్న బదోనీకి చాలా సులభమైన క్యాచ్ ఇచ్చాడు.
దాంతో లక్నో శిబిరం సంబరాల్లో మునిగిపోగా.. అయ్యర్ మాత్రం నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. దీంతో కేవలం 11 పరుగులకే కోల్‌కతా జట్టు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.