కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చక్కగా ఆడుతున్న దీపక్ హుడా (42) పెవిలియన్ చేరాడు. ఆండ్రీ రస్సెల్ వేసిన 13వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన హుడా.. శ్రేయాస్‌కు చిక్కాడు. రసెల్ వేసిన షార్ట్ బాల్‌ను పుల్ చేసేందుకు హుడా ప్రయత్నించాడు. అయితే ఆ బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు. దీంతో మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. హఫ్ సెంచరీ చేస్తాడునుకున్న హుడా.. 42 పరుగులకే పెవిలియన్ చేరాడు.