కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు విజృంభించారు. ఆరంభం నుంచి లక్ష్య ఛేదనలో తడబడిన కేకేఆర్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టించారు. ఛేజింగ్‌లో మొహ్సిన్, చమీర కలిసి పవర్‌ప్లేలో కేకేఆర్‌ను దెబ్బతీశారు. ఆ తర్వాత ఆవేష్ ఖాన్, జేసన్ హోల్డర్ చివర్లో టెయిల్‌ను ముగించారు. దాంతో కోల్‌కతా జట్టు ఏ కోశానా కోలుకునేలా కనిపించలేదు.
చివరకు 101 పరుగులకే చాపచుట్టేసింది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రస్సెల్ (45) ఒక్కడే విజయం కోసం పోరాడాడు. మిగతా బ్యాటర్లంతా ఇలా వచ్చామా.. అలా పోయామా అన్నట్లే క్రీజులో సమయం గడిపారు. ఆరోన్ ఫించ్ (14), బాబా ఇంద్రజిత్ (0), శ్రేయాస్ అయ్యర్ (6), నితీష్ రాణా (2), రింకూ సింగ్ (6) ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చెయ్యలేకపోయారు.
రస్సెల్‌తోపాటు నరైన్ (22) కాసేపు పోరాడాడు. కానీ వాళ్లకు అవతలి ఎండ్ నుంచి సహకారం లభించలేదు. దీంతో ఆ జట్టు 14.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. లక్నో బౌలర్లలో జేసన్ హోల్డర్, ఆవేష్ ఖాన్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. మొహ్సిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
WHAT A WIN this for the @LucknowIPL. They win by 75 runs and now sit atop the #TATAIPL Points Table.
Scorecard – https://t.co/54QZZOwt2m #LSGvKKR #TATAIPL pic.twitter.com/NYbP1S2xIt
— IndianPremierLeague (@IPL) May 7, 2022