లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు ఓపెనర్ బాబా ఇంద్రజిత్ (0) పూర్తిగా విఫలమయ్యాడు. దాంతో క్రిజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (6) కూడా అతనిలాగే షార్ట్ బంతికి పెవిలియన్ చేరాడు. పవర్‌ప్లే చివరి ఓవర్లో మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (14) కూడా షార్ట్ బంతికే వికెట్ సమర్పించుకున్నాడు.
జేసన్ హోల్డర్ వేసిన బంతిని ఆడే క్రమంలో గాల్లోకి ఎత్తుగా లేపాడు. అది చూసిన కీపర్ డీకాక్.. తనే వెళ్లి క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఫించ్ ఇన్నింగ్స్ ముగిసింది. పవర్ ప్లే ముగిసే సరికి కోల్‌కతా జట్టు 3 వికెట్ల నష్టానికి కేవలం 25 పరుగులు మాత్రమే చెయగలిగింది.