లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనింగ్ సమస్యలతో సతమతం అవుతున్న ఆ జట్టు.. బాబా ఇంద్రజిత్‌ను ఓపెనర్‌గా పంపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మొహ్సిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్ ఐదు బంతులను డాట్ బాల్స్ ఆడిన అతను.. చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
మొహ్సిన్ వేసిన షార్ట్‌బాల్‌ను పుల్ చేయబోయాడు. కానీ దానికి సరిపడా రూమ్ దొరక్కపోవడంతో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. స్క్వేర్ లెగ్‌లో ఉన్న బదోని ఆ క్యాచ్ అందుకోవడంతో ఇంద్రజిత్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఒక్క పరుగు కూడా చేయకముందే కోల్‌కతా జట్టు తొలి వికెట్ కోల్పోయింది.