కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి లక్నో సారధి కేఎల్ రాహుల్ (0) అవుటయ్యాడు. దీంతో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్ (50) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే ఏడో ఓవర్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాతి ఓవర్ రెండో బంతికే అవుటయ్యాడు.
నరైన్ వేసిన బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీకి పంపేందుకు డీకాక్ ప్రయత్నించాడు. కానీ దాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడంతో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శివమ్ మావికి సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 73 పరుగుల వద్ద లక్నో జట్టు రెండో వికెట్ కోల్పోయింది.