లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా విజయావకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆండ్రీ రస్సెల్ (45)ను ఆవేష్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. ఆవేష్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రస్సెల్.. థర్డ్ మ్యాన్‌లో హోల్డర్‌కు చిక్కాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అనుకూల్ రాయ్ (0)ను కూడా ఖాతా తెరవకముందే ఆవేష్ అవుట్ చేశాడు.
అతను వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన అనుకూల్.. బంతిని మిస్ అయినట్లు కనిపించింది. అయితే ఆవేష్ అప్పీల్ చేస్తే అంపైర్ అవుట్ ఇచ్చాడు. అనుకూల్ రివ్యూ కోరగా.. బంతి అతని గ్లవ్‌ను తాకినట్లు తేలింది. దాంతో అతను పెవిలియన్ చేరాడు. ఈ వికెట్‌తో కేకేఆర్ జట్టు 85 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.