తొలి ఐపీఎల్ ఆడుతున్న రెండు కొత్త జట్లు తొలి విజయం కోసం తహతహలాడుతున్నాయి. తమ సత్తా నిరూపించుకునేందుకు, ఐపీఎల్లో తామేమీ అండర్డాగ్స్ కాదని, ట్రోఫీ రేసులో ఉన్నామని చాటి చెప్పేందుకు ఈ కొత్త జట్లకు అవకాశం దొరికింది. గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్కు వాంఖడే స్టేడియం సిద్ధమైంది.
స్టార్ ఆల్రౌండర్ సారధ్యంలోని గుజరాత్ టైటన్స్ జట్టు టాస్ గెలిచింది. ముందుగా బౌలింగ్ చేస్తామని హార్దిక్ ప్రకటించాడు. వికెట్ ఎలా ఉంటుందో చూడాలని, అలాగే మంచు ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
తమ జట్టులో లోకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్, మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్ ఓవర్సీస్ ఆటగాళ్లుగా బరిలో దిగుతున్నారని చెప్పాడు. టీమిండియా సూపర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేయనున్నారు.
గుజరాత్ టైటన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్మన్ గిల్, మాథ్యూ వేడ్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, లోకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, వరుణ్ ఆరోన్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మనీష్ పాండే, కృనాల్ పాండ్యా, క్వింటన్ డీ కాక్, ఎవిన్ లూయిస్, దుష్మంత చమీర, దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, ఆవేశ్ ఖాన్, మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయి.
Gujarat Titans have won the toss and they will bowl first against #LSG.
Live – https://t.co/u8Y0KpnOQi #GTvLSG #TATAIPL pic.twitter.com/HZyySJiPSm
— IndianPremierLeague (@IPL) March 28, 2022