LSG Vs CSK | లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. 11 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఆరో వికెట్‌కు శివం దూబేతో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. మ్యాచ్తర్వాత ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కి ఎంపికయ్యాడు. తనకు అవార్డును ప్రకటించడంపై ‘తల’ షాక్ అయ్యాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ధోని 236.36 స్ట్రయిక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 27 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ప్రకటించిన సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తనను అవార్డుకు ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. చెన్నై జట్టుకు చెందిన స్పిన్నర్ నూర్ అహ్మద్‌ని ఈ సందర్భంగా ధోని ప్రశంసించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు నూర్ అర్హుడని తెలిపారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత.. ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకు ఇస్తున్నారో తెలియదని.. ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు. నూర్ చాలా బాగా బౌలింగ్ చేశాడని తాను అనుకుంటున్నానని చెప్పాడు. కొత్త బంతితోనూ చాలా బాగా బౌలింగ్ చేశారని పేర్కొన్నాడు. నిజానికి యువ ఆఫ్ఘన్స్పిన్నర్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 13 పరుగులు ఇచ్చాడు. వికెట్లు మాత్రం దక్కలేదు. 3.25 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 2019 తర్వాత తొలిసారిగా ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 2206 రోజుల తర్వాత ఐపీఎల్లో సోమవారం మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్‌ని గెలుచుకున్నాడు. ఐపీఎల్లో 18వ సారి ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. చివరిగా 2019లో రాజస్థాన్‌తో మ్యాచ్‌లో అవార్డును అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 75 పరుగులు చేశాడు.
ఈ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో గెలువడం బాగుందని చెప్పాడు. దురదృష్టవశాత్తు చివరి మ్యాచ్‌లో గెలువలేకపోయామని.. ఈ విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు. క్లిష్టమైన మ్యాచ్‌లో గెలిచినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ విజయంతో జట్టును సెట్ చేస్తుందని ఆశిస్తున్నానని.. గత మ్యాచ్‌లో తాము తొలి ఆరు ఓవర్లలో బౌలింగ్చేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డామని.. కానీ, మిడిల్ఓవర్ల మ్యాచ్తిరిగి తమ చేతుల్లోకి చేరిందని చెప్పాడు. బ్యాటింగ్‌లో ఆశించిన ఆరంభం పొందలేకపోయామని.. బహుశా చెన్నై వికెట్వల్ల కావొచ్చని.. భవిష్యత్‌లో మెరుగైన ప్రదర్శన ఇస్తామని తెలిపాడు.