IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనే కసితో ఉంది. ఈ సమయంలో లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా(Sanjiv Goenka), కెప్టెన్ రాహుల్(KL Rahul) ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో గొయెంకా.. రాహుల్‌ను ప్రేమగా కౌగిలించుకున్నాడు. దాంతో, గొయెంకా ప్రవర్తనలో మార్పును చూసిన అభిమానులు ఒకింత షాక్ అవుతున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై దారుణ ఓటమి అనంతరం రాహుల్‌ను గొయెంకా మైదానంలోనే కడిగిపారేశాడు. రాహుల్ వైపు చేయి చూపస్తూ దుర్బాషలాడిన వీడియో క్షణాల్లో వైరల్ అయింది. దాంతో, మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకూ అందరూ గొయెంకా తీరును తీవ్రంగా విమర్శించారు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న గొయెంకా ఆ వివాదానికి తెర దించాడు.
KL Rahul with Sanjiv Goenka at the special Dinner in Sanjiv Goenka’s home last night in Delhi. [LSG]
– All is well at LSG Camp. 🌟 pic.twitter.com/W5BtE0Qmff
— Johns. (@CricCrazyJohns) May 14, 2024
తాజాగా అతడు ఢిల్లీలోని తన స్వగృహంలో రాహుల్‌కు పార్టీ ఇచ్చాడు. ఆ సందర్భంగా’ హైదరాబాద్‌లో అన్నమాటలు మనసులో పెట్టుకోవద్ద’ని చెప్తూ.. ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.

పదిహేడో సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ చెత్త ఆటతో ప్లే ఆఫ్స్ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడింది. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ల ఊచకోతకు లక్నో బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(89 నాటౌట్), అభిషేక్ శర్మ(75 నాటౌట్)ల విధ్వంసంతో లక్నో నిర్దేశించిన 166 పరుగులను 58 బంతులుండగానే ఆరెంజ్ ఆర్మీ ఛేదించంది. దాంతో, కేఎల్ రాహుల్ సేన ఏడో స్థానానికి పడిపోయింది. మంగళవారం చావోరేవో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో తలపడనుంది.
