IPL 2025 : గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్న లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఓపెనర్ మిచెల్ మార్ష్ (51) అర్ధ శతకం సాధించాడు. ఇస్టరీ స్పిన్ర్ సాయి కిశోర్ బౌలింగ్‌లో సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు మార్ష్. 33 బంతుల్లోనే ఈ హిట్టర్ ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఈ సీజన్లో ఈ ఆసీస్ చిచ్చరపిడుగుకు ఇది లక్నో తరఫున ఆరో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
శతక భాగస్వామ్యం నెలకొల్పేలా కనిపించిన ఓపెనింగ్ ద్వయాన్ని సాయికిశోర్ విడదీశాడు. చివరి బంతికి ఎడెన్ మర్క్రమ్(36)ను ఔట్ చేసి గుజరాత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. మర్క్రమ్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద షారుక్ ఖాన్ క్యాచ్ పట్టడంతో 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్(6) చివరి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, లక్నో 10 ఓవర్లకు వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
Fifty partnership up between the @LucknowIPL openers 🔥#LSG are 53/0 at the end of powerplay.
Updates ▶ https://t.co/NwAHcYJT2n #TATAIPL | #GTvLSG pic.twitter.com/oHqwESqepg
— IndianPremierLeague (@IPL) May 22, 2025