ముంబైకి ఏడుపే.. కష్టపడి గెలిచిన లక్నో
ఐపీఎల్-17లో చెత్త ప్రదర్శనతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ‘లో స్కోరింగ్ థ్రిల్లర్'లో రాహుల్సేనదే పైచేయి అయింది.
- రాణించిన సూపర్ జెయింట్స్ బౌలర్లు
లక్నో : ఐపీఎల్-17లో చెత్త ప్రదర్శనతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ‘లో స్కోరింగ్ థ్రిల్లర్’లో రాహుల్సేనదే పైచేయి అయింది. లక్నో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో.. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. వధేరా 46) ఆ జట్టును ఆదుకున్నాడు. అనంతరం ఛేదనలో లక్నో సైతం కష్టమ్మీదే గెలిచింది. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టోయినిస్ (62) లక్నో విజయంలో కీలకపాత్ర పోషించాడు. లీగ్‌లో పది మ్యాచ్‌లు ఆడిన ముంబై ఏడు ఓటములు, మూడు విజయాలతో 9వ స్థానంలో ఉంది.
ముంబై దారుణంగా..
57/4. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై పది ఓవర్లకు చేసిన స్కోరు అది. రోహిత్‌శర్మ (4), సూర్యకుమార్ (10), తిలక్ వర్మ (7), పాండ్యా(0) చేతులెత్తేయడంతో 5.2 ఓవర్లకే ముంబై 4 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. వధేరా ఆచితూచి ఆడి ఆ జట్టును ఆదుకోగా ఆఖర్లో డేవిడ్ ( 35 నాటౌట్) మెరుపులు మెరిపించకుంటే ముంబై పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది.
లక్నో కష్టంగానే..
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో కూడా కష్టంగానే గెలుపు దిశగా సాగింది. తొలి ఓవర్లోనే ఆ జట్టు ఓపెనర్ అర్షిన్ కులకర్ణి వికెట్ కోల్పోయింది. కెఎల్ రాహుల్ (28) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీపక్ హుడా (18) మళ్లీ విఫలమయ్యాడు. కానీ చెన్నైతో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన స్టోయినిస్ లక్నోను మరోసారి ఆదుకున్నాడు. అయితే లక్నో విజయానికి 30 పరుగులు అవసరమనగా అతడు కూడా పెవిలియన్ చేరాడు. బదోని (6) సైతం రనౌట్ అయ్యాడు. కానీ పూరన్ (14 నాటౌట్), కృనాల్ (1 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 144/7 (నెహాల్ 46, డేవిడ్ 35నాటౌట్, మోహ్సిన్ 2/36, నవీనుల్ 1/15)
లక్నో: 19.2 ఓవర్లలో 145/6 (స్టోయినిస్ 62, రాహుల్ 28, హార్దిక్ 2/26, నబీ 1/16)

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

