గువహతి : టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలిచి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న అసోం అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్ తన కల సాకారం దిశగా కీలక ముందడుగు వేసింది. తమ ప్రాంతంలో యువ బాక్సర్లకు అంతర్జాతీయ వసతులతో కూడిన మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు గాను సొంతగా బాక్సింగ్ అకాడమీని ఏర్పాటు చేసింది.
ఈనెల 03 (మంగళవారం)న అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ‘లవ్లీనా బాక్సింగ్ అకాడమీ’ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు లవ్లీనా స్పందిస్తూ.. ‘ఈ అకాడమీ ఒక శిక్షణ కేంద్రం మాత్రమే కాదు. రింగ్‌లో దిగి సత్తా చాటాలనుకుంటున్న ఎంతోమంది అసోం యువ బాక్సర్ల కల కూడా నెరవేరనుంది. ఇక్కడ ఒక్క బాక్సింగ్ ఆట గురించే మెలుకువలు నేర్పడమే గాక విజయాలు సాధించేందుకు అవసరమైన క్రమశిక్షణ, అచంచలమైన క్రీడా స్ఫూర్తిని ఇది నేర్పిస్తుంది’ అని తెలిపింది.