Sachin Tendulkar | ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంజలి పెండ్లి అనేక మలుపులు తిరుగాయని అతని అత్త అన్నాబెల్ తాను రాసిన ‘మై ప్యాసెజ్ టు ఇండియా’ అనే పుస్తకంలో ప్రస్తావించింది. ఇందులో పలు ఆసక్తికర అం శాలను ఆమె వెల్లడించింది. ‘1950 ప్రాంతంలో మా కుటుంబం ఇంగ్లండ్ నుంచి భారత్‌కు వచ్చింది. కొన్నేండ్లకు అంజలితో సచిన్‌కు పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల వ్యవధిలోనే అతను అంజలిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయం మాట్లాడేందుకు సచిన్ మా ఇంటికి వచ్చాడు. అప్పుడు అతని వయస్సు 19 ఏండ్లు అనుకుంటా. అంజలి..పొడవాటి, అందమైన వ్యక్తిని పెండ్లి చేసుకుంటుదనుకున్నాం. కానీ వయసులో ఐదేండ్లు చిన్నవాడైన సచిన్‌తో వివాహానికి ఓకే అంటుందని అనుకోలేదు. అంజలి ఐదున్నర అడుగులు ఉంటుంది.. సచిన్ కూడా అంతే ఎత్తులో కనిపించాడు. ఇద్దరి ఎత్తులో పెద్ద తేడా లేదు. క్రికెటర్లు ప్లేబాయ్‌గా మారుతారనే ఆలోచన ఉండేది. కానీ సచిన్ విషయంలో అలా జరుగలేదు. వారి ప్రేమపై ఉన్న పవిత్రత అర్థం చేసుకున్నాం’ అని రాసుకొచ్చింది.
చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ)కి స్టార్ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ దూరమైంది. పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన శ్రీజ..తీవ్రమైన ఒత్తిడి కారణంగా యూటీటీలో ఆడటం లేదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 22 నుంచి చెన్నై వేదికగా యూటీటీ లీగ్ మొదలుకాబోతున్నది.