ఢిల్లీ : జాతీయ క్రీడా బిల్లు (ఎన్ఎస్బీ)కు పార్లమెంట్ ఆమోదం లభించింది. సోమవారం లోక్సభ ఈ బిల్లుకు మద్దతు తెలపగా మంగళవారం రాజ్యసభ కూడా ఆమోదించింది. ఎన్ఎస్బీతో పాటు జాతీయ డోపింగ్ నిరోధక బిల్లుకూ రాజ్యసభ జై కొట్టింది.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఎగువసభలో మధ్యాహ్నం 3 గంటలకు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. బీహార్ ఎన్నికల జాబితాలో అవకతవకలపై ప్రతిపక్షాలు సభలో ఆందోళన చేస్తుండగానే బిల్లులు చర్చకు వచ్చాయి.