INDW vs AUSW : మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆరంభంలోనే కెప్టెన్ అలీసా హేలీ(5) ఔటైనా.. ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్ (101 నాటౌట్) శతకంతో చెలరేగిపోయింది. బౌండరీల మోతతో విరుచుకుపడిన ఈ యంగ్‌స్టర్.. శ్రీచరణి ఓవర్లో ఫోర్‌తో వలర్డ్ కప్‌లో తొలి శతకం నమోదు చేసింది. అలీసా పెర్రీ (40 నాటౌట్) యాంకర్ రోల్ పోషిస్తుండగా 24 ఓవర్లకే ఆసీస్ స్కోర్ 150 దాటింది. ఇంకా ఓవర్లు ఉండడం.. చేతిలో 9 వికెట్లు ఉండడంతో భారీ స్కోర్ కొట్టడం ఖాయమనిపిస్తోంది. అలా జరగకూడదంటే.. వరుసగా వికెట్లు తీస్తే తప్ప కంగారూలను అడ్డుకోవడం కష్టమే.
డీవై పాటిల్ స్టేడియంలో ఆస్ట్రేలియాకు చెక్ పెట్టాలనకున్న భారత జట్టుకు షాకిచ్చేలా సాగుతోంది ఆ జట్టు ఇన్నింగ్స్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. దూకుడే మంత్రగా ఆడుతోంది. లీగ్ దశలో సెంచరీ బాదిన అలీసా హేలీ(5)ని క్రాంతి గౌడ్ ఆరో ఓవర్లోనే వెనక్కి పంపింది. ఇక ఆ జట్టు ఒత్తిడిలో పడుతుందనుకుంటే.. యువఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(101 నాటౌట్), అలీసా పెర్రీ(40 నాటౌట్)లు క్రీజులో పాతుకుపోయారు. వీరిద్దరూ భారత బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ స్కోర్‌బోర్డును ఉరికిస్తున్నారు.
Kranti Gaud has dismissed Alyssa Healy four times in five innings 😵#INDvAUS live 👉 https://t.co/k3G9CxqjCR pic.twitter.com/yAnZFAroMk
— ESPNcricinfo (@ESPNcricinfo) October 30, 2025