న్యూఢిల్లీ: ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని అర్జెంటీనా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫైనల్ ఫోటోలను ఓ గ్యాలరీగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశాడు కెప్టెన్ మెస్సి. ఆ పోస్టు ఇప్పుడు ఇన్‌స్టా రికార్డులు తిరగరాస్తోంది. కప్ గెలిచిన తర్వాత ఎంజాయ్ చేస్తున్న అర్జెంటీనా టీమ్ ఫోటోలు ఆ గ్యాలరీలో ఉన్నాయి. ఆ గ్యాలరీకి ఇప్పటికే 6.8 కోట్ల లైక్‌లు వచ్చేశాయి.
ఆదివారం జరిగిన సెన్షేషనల్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టుపై షూటౌట్లో అర్జెంటీనా నెగ్గిన విషయం తెలిసిందే. ఫైనల్లో మెస్సి రెండు గోల్స్ చేశాడు. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీకి ఇచ్చే గోల్డెన్ బాల్‌ను మెస్సి గెలుచుకున్నాడు.
గతంలో ఇన్‌స్టాలో అత్యధిక లైక్‌లు వచ్చిన పోస్టు బ్రౌన్ ఎగ్. 2019లో ఆ పోస్టు చేశారు. ఆ ఎగ్ పోస్టుకు సుమారు 5.7 కోట్ల లైక్‌లు వచ్చాయి. వరల్డ్‌కప్ గెలిచిన అర్జెంటీనాకు స్వదేశంలో గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ప్లేయర్లు అంతా రూఫ్‌టాప్ బస్సులో పరేడ్ నిర్వహించారు.