Lionel Messi : అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈఫైనల్‌తో కలిపి ఇప్పటివరకు మెస్సీ 26 మ్యాచ్‌లు ఆడాడు. దాంతో జర్మనీకి చెందిన లోథర్ మథాస్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇది మెస్సీకి కెరీర్లో చివరి వరల్డ్ కప్. దాంతో, ఆది నుంచి జట్టును సమర్థంగా నడిపిస్తూ ఫైనల్ దాకా తీసుకొచ్చాడు. అంతేకాదు ఫైనల్లో జట్టుకు తొలి గోల్ అందించాడు. దాంతో ఈ టోర్నీలో అతను అరు గోల్స్ సాధించాడు. 35వ నిమిషంలో డీ మరియా గోల్ కొట్టడంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
లూసెయిల్ స్టేడియంలో ఫ్రాన్స్‌తో జరుగుతున్న ఫైనల్లో మెస్సీ 23వ నిమిషంలో పెనాల్టీ షూట్‌ను గోల్‌గా మలిచాడు. 35వ నిమిషంలో అందివచ్చిన అవకాశాన్ని డి మరియా సద్వినియోగం చేసుకొని గోల్ కొట్టాడు. తొలి అర్థభాగంలోనే రెండు గోల్స్ కొట్టిన అర్జెంటీనా మ్యాచ్‌పై పట్టు సాధించింది.