స్పెయిన్ : స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్‌లో మెక్లారెన్ డ్రైవర్లు దుమ్మరేపారు. ఆస్ట్రేలియా కుర్రాడు ఆస్కార్ పియాస్ట్రి తొలిస్థానంతో సత్తా చాటగా లాండొ నొరిస్ (బ్రిటన్) రెండో స్థానంలో నిలిచాడు.
ఆదివారం మొంట్మెలొ (స్పెయిన్)లో జరిగిన ఫైనల్ రేసును పియాస్ట్రి.. 66 ల్యాప్స్‌ను 1:32:57.375 నిమిషాల్లో పూర్తిచేసి ఈ సీజన్లో ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టెపెన్.. పదో స్థానంలో నిలవడం గమనార్హం.