రోమ్: గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో క్రీడాకారులకు నగదు బహుమతి రూపంలో ఇచ్చే రెవెన్యూ వాటను పెంచకపోతే ప్లేయర్లంతా టోర్నీలను బాయ్‌కాట్ చేయాలని ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా పిలుపునిచ్చింది. ఈ నెల 28వ తేదీ నుంచి జరిగే ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ కోసం ఇటీవల ప్రకటించిన ప్రైజ్‌మనీపై సబలెంకా, పురుషుల నంబర్ వన్ యానిక్ సినర్ వంటి అగ్రశేణి ప్లేయర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
2024 ఫ్రెంచ్ ఓపెన్‌లో 15.5 శాతంగా ఉన్న ఆటగాళ ్ల వాటా ఈ ఏడాది 14.9 శాతానికి పడిపోవడాన్ని నిరసిస్తున్నారు. ఏటీపీ, డబ్ల్యూటీఏ ఈవెంట్స్ మాదిరిగానే గ్రాండ్‌స్లామ్స్‌లోనూ 22 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటగాళ్లు లేకుండా టోర్నమెంట్ లేదని, తమ హక్కుల సాధన కోసం బహిష్కరణ ఒక్కటే మార్గమని సబలెంకా స్పష్టం చేసింది.