హైదరాబాద్, ఆట ప్రతినిధి : భారత వెటరన్ పుట్‌బాల్ ప్లేయర్ డీఎమ్‌కే అఫ్జల్ బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న అఫ్జల్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
గురువారం అంత్యక్రియలు జరుగనున్నాయి. 1962 ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు స్వర్ణం సాధించడంలో అఫ్జల్ కీలకంగా వ్యవహరించారు. అఫ్జల్ మృతికి తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో పాటు సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి సంతాపం ప్రకటించారు.