Mike Tyson : మైక్ టైసన్.. ఈ పేరు బాక్సింగ్ అభిమానులకు సుపరిచితమే. అతడు రింగ్‌లోకి దిగాడంటే ఎంతటివారైనా మట్టికరవాల్సిందే. వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్‌గా రికార్డులు నెలకొల్పిన టైసన్ అనూహ్యాంగా ఓ కుర్రాడి చేతిలో ఓడిపోయాడు. సుమారు 19 ఏండ్ల తర్వాత బాక్సింగ్ రింగ్‌లో దిగిన టైసన్.. యూట్యాబర్ నుంచి బాక్సర్ అవతారమెత్తిన జేక్ పౌల్ (Jake Paul) ధాటికి బిత్తరపోయాడు. రింగ్‌లో మునపటిలా వేగంగా కదలలేకపోయిన అతడు తన పంచ్ పవర్ చూపించలేక 8వ రౌండ్లోనే చేతులెత్తేశాడు.
పౌల్‌తో బిగ్ బౌట్ అనంతరం టైసన్ ఇక వీడ్కోలు పలికితే బెటర్ అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. అయితే.. అతడు మాత్రం తనకు ఆ ఆలోచన లేదంటూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ‘నేనేంటో మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు నేను చెప్పుకోవడం తప్ప. ప్రపంచాన్ని ఉర్రూతలూగించే వ్యక్తిని నేను కాదు. నేను చేయగలిగిన వాటి పట్ల సంతోషంగా ఉంటాను. మరో విషజ్ఞం.. నాకు ఇప్పట్లో వీడ్కోలు పలికే ఉద్దేశం లేదు. ఆ విషయం గురించి నేను ఆలోచించడం లేదు.
అయితే.. నా రిటైర్మెంట్ అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంది అని టైసన్ వెల్లడించాడు. ఇక రింగ్‌లో తనపై పంచ్‌ల వర్షం కురిపించిన జేక్ పౌల్‌ను ఈ దిగ్గజ బాక్సర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. పౌల్ నిజంగా మంచి ఫైటర్. ఈ విజయంతో విమర్శకుల నుంచి అతడికి దక్కాల్సిన క్రెడిట్ దక్కి తీరాలి’ అని టైసన్ తెలిపాడు. మాజీ చాంపియన్ అయిన టైసన్‌కు చిత్తు చేసిన పౌల్ ఏకంగా రూ.338 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు.
సుదీర్ఘ విరామం తర్వాత టైసన్ 2020లో రింగ్‌లోకి దిగాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో రోయ్ జోన్స్ జూనియర్‌ను ఓడించిన అతడు.. ఇక తదుపరి ఫైట్‌కు సిద్ధమయ్యాడు. ఒకప్పటి బాక్సింగ్ యోధుడు అయిన టైసన్‌తో నేను తలపడుతాను అంటూ జాక్ పౌల్ సిద్దమయ్యాడు. యూట్యూబర్ నుంచి ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన పౌల్ సై అనడంతో అందరి కండ్లన్నీ వీళ్ల పోరుమీదే నిలిచాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 20వ తేదీనే టైసన్, పౌల్ మధ్య బిగ్ ఫైట్ జరగాల్సింది. అయితే.. టైసన్ అనారోగ్యానికి గురవ్వడంతో మ్యాచ్ వాయిదా పడింది.
అమెరికాకు చెందిన మైక్ టైసన్ పంచ్ విసిరితే చాలు రికార్డులు బద్ధలై పోయేవి. ప్రపంచ చాంపియన్‌గా, తిరుగులేని బాక్సర్‌గా రికార్డులు నెలకొల్పిన అతడు.. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో1966 జూన్ 30వ తేదీన జన్మించాడు. పసితనంలో ఎన్నో కష్టాలు అనుభవించిన టైసన్ బాక్సింగ్ వైపు ఆకర్షితుడయ్యాడు. లెజెండరీ ట్రైనర్ కస్ డీఅమటోస్ వద్ద శిక్షణ తీసుకొని రాటుదేలిన టైసన్ 18 ఏండ్ల వయసులో ప్రొఫెషనల్ బాక్సర్‌గా బరిలోకి దిగాడు.
ప్రత్యర్థులపై కసికొద్దీ పంచ్‌లు విసిరే అతడు1986లో తొలిసారి హెవీవెయిట్ చాంపియన్‌గా అవతరించాడు. అప్పుడు అతడికి 20 ఏండ్లు. దాంతో, చిన్న వయసులోనే హెవీవెయిట్ చాంపియన్ అయిన బాక్సర్‌గా టైసన్ చరిత్ర సృష్టించాడు. రింగ్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన టైసన్‌కు ఐరన్ మైక్ అనే పేరు స్థిరపడింది.
TYSON’S QUICKEST KNOCKOUT
30 Seconds
Mike Tyson KO’s Marvis Frazier
July 26, 1986 pic.twitter.com/1IR2Q7qF2W
— Kevin Gallagher (@KevG163) November 15, 2024
తన పంచ్ పవర్‌తో ఎందర్నో పడగొట్టిన అతడు 50-6తో ప్రొఫెషనల్ రికార్డు నెలకొల్పాడు. అందులో 44 నాకౌట్స్ ఉండడం విశేషం. అంతేకాదు బౌట్ సమయంలో ప్రత్యర్థుల చెవులు కొరుకుతూ వివాదాల్లో చిక్కుకున్నాడు టైసన్.