Gouher Sultana : భారత మహిళా క్రికెటర్ గౌహెర్ సల్తానా (Gouher Sultana) వీడ్కోలు పలికింది. చురుకైన ఫీల్డర్‌గా పేరొందిన ఆమె అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగింది. గురువారం ఇన్స్టాగ్రామ్ వేదికగా తన రిటైర్మెంట్ వార్తను వెల్లడించిందీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. చివరిసారిగా 2014 ఏప్రిల్‌లో టీమిండియా జెర్సీ వేసుకున్న సుల్తానా ఆ తర్వాత డబ్ల్యూపీఎల్‌తో వెలుగులోకి వచ్చింది. రెండు సీజన్లలో యూపీ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించిందీ స్పిన్ ఆల్‌రౌండర్.
‘వరల్డ్ కప్స్, విదేశీ పర్యటనల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం జీవితంలో నాకు దక్కిన గొప్ప గౌరవం. దేశానికి ఆడడం ద్వారా నా నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెరిగాయి. నేను తీసిన ప్రతి వికెట్, మైదానంలో చేసిన ప్రతి డైవ్, మ్యాచ్ సమయంలో సహచరులతో గుంపుగా నిల్చోవడం వంటవి నేను క్రికెటర్‌గా రాటుదేలడంలో ఉపయోగపడ్డాయి’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
🚨Gouher Sultana has announced her retirement from all forms of cricket #BCCIWomen @TrishaGhosal @snehasis_95 pic.twitter.com/NJPavfK8nK
— RevSportz Global (@RevSportzGlobal) August 21, 2025
2014లో జట్టులో చోటు కోల్పోయిన సుల్తానా మహిళల ప్రీమియర్ లీగ్‌లో మళ్లీ స్టేడియంలో అడుగుపెట్టింది. రెండో సీజన్లో విఫలమైన తను.. మూడో ఎడిషన్‌లో ఫర్వాలేదనిపించింది. 2008లో అరంగేట్రం చేసిన సుల్తానా 57 వన్డేలు, 37 టీ20లు ఆడింది. వన్డేల్లో 19.39 సగటుతో 66 వికెట్లు పడగొట్టింది.