BCCI : ఆసియా క్రీడలు సమీపిస్తున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సంచలన నిర్ణయం తీసుకోనుంది. జపాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుకు కోచ్, సహాయక సిబ్బందిని ఖరారు చేయనుంది బీసీసీఐ. ఊహించినట్టే హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) స్థానంలో.. వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) ఎంపికయ్యే అవకాశముంది. ఆసియా క్రీడల్లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని యువ భారత్‌కు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని సమాచారం.
ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమిపై సమీక్షా సమావేశం సందర్భంగా బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఆసియా క్రీడలకు లక్ష్మణ్‌ను కోచ్‌గా పంపాలని బీసీసీఐ అనుకుంటోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలానే సహాయక సిబ్బందిగా కొందరిని ఎంపిక చేసినట్టు టాక్. అయితే.. భారత బోర్డు మాత్రం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
VVS Laxman, Director of Cricket at the National Cricket Academy, will take charge of the Indian men’s team at the upcoming Asian Games to be held in Aichi-Nagoya Japan later this month.
Gautam Gambhir, the regular head coach, will be travelling with the senior team during the… pic.twitter.com/V3iDTLQek7
— Sportstar (@sportstarweb) September 3, 2026
శ్రీలంక పర్యటనలో టెస్టు సిరీస్ సమం చేసిన భారత్ మరో మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనంది టీమిండియా. అయితే.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాత్రం జట్టుతో వెళ్లడం లేదు. జింబాబ్వే పర్యటనలో విజయవంతమైన తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌నే ఈ మెగా టోర్నీకి పంపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి భావిస్తోంది.
VIDEO | Mumbai: Centre of Excellence chief VVS Laxman leaves BCCI headquarters post review meeting.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/fs8JVpio8A
— Press Trust of India (@PTI_News) September 3, 2026
లక్ష్మణ్‌ను మళ్లీ కోచ్‌గా నియమించాలి అనుకోవడానికి మరో కారణం ఉంది. సరిగ్గా ఆసియా క్రీడల సమయంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఉంది. దాంతో.. గౌతీ స్వదేశంలోనే ఉండిపోనుండగా.. శ్రేయాస్ అయ్యర్ బృందంతో లక్ష్మణ్ జపాన్ వెళ్లడం ఖాయం. మాజీ క్రికెటర్ సునీల్ జోషి, హృషికేశ్, శుభదీప్ ఘోష్, మరూఫ్ ఫజందార్లు సహాయక సిబ్బందిగా ఎంపికైనట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
ఒకవేళ అధికారిక ప్రకటన వస్తే.. గత ఎడిషన్‌లో హంగ్జౌలో టీమిండియా స్వర్ణం గెలవడంలో కీలకమైన లక్ష్మణ్.. మరోసారి తన కోచింగ్ మ్యాజిక్ చూపించాలని ఆరాటపడుతున్నాడు. అయితే.. మహిళల టీమ్ కోచింగ్ యూనిట్లో మార్పు లేదు. ప్రధాన కోచ్ అమోల్ మజుందార్, ఆవిష్కార్ సాల్వి సహాయక కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచే మొదలవ్వనుండగా.. పురుషుల క్రికెట్ పోటీలు మాత్రం సెప్టెంబర్ 24 నుంచి షురూ అవుతాయి. అక్టోబర్ 3వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.