పొట్టి ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్‌లో భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా ఎన్సీయే హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే తాజాగా భారత కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా సోకింది. దాంతో అతను క్వారంటైన్లోకి వెళ్లాడు. జింబాబ్వే సిరీస్ సమయంలో కూడా భారత్‌కు కోచ్‌గా లక్ష్మణే వ్యవహించాడు.
దీంతో తననే ఆసియా కప్‌లో తాత్కాలికంగా కోచింగ్ బాధ్యతలు స్వీకరించాలని బీసీసీఐ కోరింది. దీనికి లక్ష్మణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దాంతో భారత జట్టుతోపాటు లక్ష్మణ్ కూడా యూఏఈ వెళ్లాడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత జట్టుతో ద్రవిడ్ కలుస్తాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే జింబాబ్వే సిరీస్‌లో ఆడిన జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా, ఆవేష్ ఖాన్‌తోపాటు లక్ష్మణ్ కూడా హరారే నుంచి దుబాయ్ చేరుకున్నట్లు తెలిపింది.
NEWS – VVS Laxman named interim Head Coach for Asia Cup 2022.
More details here 👇👇https://t.co/K4TMnLnbch #AsiaCup #TeamIndia
— BCCI (@BCCI) August 24, 2022